వినోద్ జైన్ ను సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని.. చిన్నారి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వెలంపల్లి డిమాండ్ చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ చిన్నారిని ఇబ్బంది పెట్టాడని.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా దుర్మార్గంగా వ్యవహరించాడని.. 54 ఏళ్ల వ్యక్తికి ఈ బుద్ది ఎలా వచ్చిందో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు. వినోద్ కుమార్ జైన్ను కఠినంగా శిక్షిస్తామని.. అందరూ బాధపడుతోన్నారని తెలిపారు.
ఆ కుటుంబానికి ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరని.. కేశినేని నానికి ముఖ్య అనుచరుడు, చంద్రబాబు కూడా వినోద్ జైన్ కోసం ప్రచారం చేశారని నిప్పులు చెరిగారు. చిన్నారుల పట్ల కీచకుడిలా మారాడని.. కఠినంగా శిక్షిస్తామన్నారు. చంద్రబాబు ఇలాంటీ నీచులను ప్రొత్సహించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. ఆడవాళ్ల జోలికెళ్లాలంటే భయపడేలా శిక్షిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ఇలాంటి వాళ్లను ప్రొత్సహించకూడదు.. నీచ రాజకీయాలకు పాల్పడకూడదన్నారు. ఒకే అపార్ట్మెంటులో ఉంటూ ఈ విధంగా చేసిన వినోద్ జైన్ లాంటి వాళ్లు సంఘంలో ఉండకూడదన్నారు.