అంతర్వేది రథం దగ్దం ఘటనలో ప్రతిపక్షాల పాత్ర ఉందని అనుమానం వస్తోందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మీద కావాలనే కొందరు మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నాయని, హిందూవుల మీద ఈ ప్రభుత్వంలో ఏదో జరుగుతోందనే భావన కల్పించేలా కుట్రలు పన్నుతున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్వేది దేవాలయం ఈవోను బదిలీ చేస్తున్నామన్న ఆయన రథం దగ్దం ఘటనపై విచారణ జరుగుతోందని అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా రూ. 90 లక్షల వ్యయంతో కొత్త రథం సిద్దం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతర్వేది ఘటనను రాజకీయం చేయడం సరికాదన్న ఆయన గత పుష్కరాల్లో చంద్రబాబు 40 దేవాలయాలను కూల్చేశారని, గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టపెట్టుకున్నారని అన్నారు. గుళ్లను కూల్చినప్పుడు.. 29 మంది చనిపోయినప్పుడు నిజ నిర్దారణ కమిటీలు ఎందుకు వేయలేదని మంత్రి ప్రశ్నించారు. గతంలో నెల్లూరులో కూడా రథం దగ్దం అయిందని, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల రథాలని సీసీ కెమెరాలతో నిఘా పెడతామని అన్నారు.