సారా వీర్రాజు దేశ భక్తుడా…తెలుగు దేశం భక్తుడా? : మంత్రి వెల్లంపల్లి ఫైర్‌

సారా వీర్రాజు దేశ భక్తుడా…తెలుగు దేశం భక్తుడా? అంటూ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి ఫైర్‌ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని… సీఎంపై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. జగన్‌ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి అని.. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సారా వీర్రాజు అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

సీఎం జగన్‌ ను దేశ ద్రోహి అని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని… గత ప్రభుత్వంలో బీజేపీ వ్యక్తే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను కూల్చేసిన చరిత్ర బీజేపీదని… దేవాలయాలను కడుతున్నది వైసీపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు అన్ని గమనిస్తున్నారని… బీజేపీ పార్టీ నాయకులకు తగిన బుద్ది చెబుతారని ఆగ్రహించారు.