వెంకటేష్ “సైన్ధవ్” మూవీ నుండి స్పెషల్ పోస్టర్…!

-

టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ వయసు మీద పడుతున్నా యువ హీరోలతో పోటీగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక వెంకటేష్ తాజాగా నటించిన సినిమా సైన్ధవ్, ఈ సినిమాను ఒక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ ప్రతీకారం తీర్చుకునే ఒక తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేశు కొలను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ రోజు చిల్డ్రన్స్ డే కావడం వలన ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వెంకటేష్ మరియు తన కూతురు బైక్ లో వస్తున్న ఫోటో ను పోస్ట్ చేస్తూ రిలీజ్ చేశారు.

కాగా ఇందులో వెంకటేష్ సరసన శ్రద్దా శ్రీనాధ్ నటిస్తుండగా.. మిగిలిన పాత్రలలో రహానే శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్ధికి లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. మెడికల్ మాఫియా కోణంలో వస్తున్న ఈ సినిమా వెంకటేష్ కు హిట్ ను అందిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news