తిట్టిన వారే పొగిడేలా చేసిన కమిడియన్ వెన్నెల కిషోర్..!!

-

వెన్నెల కిషోర్  ఇప్పుడు కమెడియన్ గా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు కమెడియన్ గా తన కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకు పోతోంది.స్టార్ హీరో సినిమాల్లో కచ్చితంగా కిషోర్  కి పాత్ర ఉండాల్సిందే అన్న తీరున ఆయన హవా నడుస్తోంది. కిషోర్ కామెడీ టైమింగ్..పెర్పార్మెన్స్ తో  కిషోర్ టాలీవుడ్ ప్రయాణం సూపర్ గా  కొనసాగుతోంది.

వెన్నల కిషోర్ అమెరికా నుంచి ఇండియాకొచ్చి నటుడు అయిన సంగతి తెలిసిందే.  కిషోర్ చిన్న నాటి నుంచి  అల్లరిగా ఉండేవాడుట. లైఫ్ పై ఏ మాత్రం క్లారీటీ లేకుండా ఉండేవాడుట. పది పూర్తయి ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియని సందిగ్దంలో వుండే వాడట చదువు విషయలో లో మనోడుకు ఏమి చేయాలో అర్థం కాకుండా వుండే వాడట.

vennela kishore tollywood comedian
vennela kishore tollywood comedian

ఈ పరిస్థితి లో మనోడు ఏమి చేయాలో తెలియక ఊరంతా తిరుగుతూ వుండే వాడు. ఇది చూసి కిషోర్ అక్క పిల్లల్ని మావయ్యతో తిరగొద్దని చెడిపోతారని అనేవారుట. తర్వాత డిగ్రీ పూర్తి, సాప్ట్ వేర్ కోర్స్ చేసి జాబ్ సంపాదించి తర్వాత సినిమా వైపు మనసు మళ్లింది. ఇక వెన్నల సినిమా తర్వాత తను తిరిగి చూడలేదు. అప్పుడు తిట్టిన కుటుంబ సభ్యులు ఇప్పుడు విపరీతంగా పొగుడుతున్నారు. ప్రస్తుతం వెన్నల కిషోర్ డిమాండ్ మామూలుగా లేదు. చాలా సినిమాల్లోనటిస్తున్నారు.భోళాశంకర్ ఇండియన్-2`మిస్టర్ కింగ్`,ఇతర చిత్రాల్లో నటిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news