ఆ ఆర్టిస్టు దగ్గర టచ్ అప్ బాయ్ గా పని చేసిన వేణు.. కట్ చేస్తే..!

-

ప్రస్తుత కాలంలో హీరోలు.. దర్శకులుగా మారడం కొత్తేమీ కాదు.. కానీ కమెడియన్లు మెగా ఫోన్ పట్టి హిట్టు కొట్టడం మాత్రం నిజంగా అతి పెద్ద విషయం అని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పటివరకు డైరెక్టర్ గా సక్సెస్ అయిన కమెడియన్ ఒక్కరు కూడా లేరు.. కానీ ఆ రికార్డు ఇప్పుడు అందుకున్నారు కమెడియన్ వేణు.. బలగం అనే సినిమాకు వేణు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా వేణుని సత్కరించారు అంటే ఇక డైరెక్షన్లో ఆయన ఏవిధంగా సక్సెస్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయమయ్యారు. సాధారణంగా కమెడియన్ డైరెక్టర్గా మారితే అతడి నుంచి కామెడీ కథని ఎక్స్పెక్ట్ చేస్తారు.. కానీ కన్నీరు పెట్టించే కథతో బలగంను ఎమోషనల్ రోలర్ కోస్టర్ ల తెరకెక్కించారు వేణు.. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ జర్నీ గురించి పంచుకున్నారు..

ఆయన మాట్లాడుతూ.. నేను 1999లో ఇంటి నుంచి పారిపోయి వచ్చాను.. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. చాలా కష్టపడిన తర్వాత ఒక చిన్న సినిమాకు ఓ షెడ్యూల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. అలాగే ఒక రచయిత దగ్గర ఆరు నెలలు పనిచేశాను. ఆ తర్వాత కమెడియన్ చిత్రం శ్రీను అన్న దగ్గర టచ్ అప్ బాయ్ గా పని చేశాను. ఆ తర్వాత దాదాపు 200 సినిమాలలో నటించాను.. అయితే అనుకున్నంత బ్రేక్ రాలేదు. నా తర్వాత వచ్చిన వాళ్ళు దూసుకుపోతుంటే.. నేను మాత్రం సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు.. వేణు మొత్తానికి అయితే తొలి ప్రయత్నంతోనే దర్శకుడిగా సక్సెస్ అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news