ఇంకో నాలుగు రోజుల్లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఐసీసీ ఈ ఛాంపియన్ షిప్ ను ప్రవేశపెట్టిన తర్వాత జరిగే రెండవ ఫైనల్ మ్యాచ్ ఇది కావడం విశేషం. మొదటి ఫైనల్ లో ఇండియా న్యూజిలాండ్ లు ఫైనల్ చేరగా కివీస్ గదను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం జరగబోయే ఫైనల్ లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాల్సి ఉంది. కాగా ఆస్ట్రేలియా సహాయక కోచ్ డేనియల్ వెటోరీ మాట్లాడుతూ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగడం దాదాపుగా అసాధ్యమేనని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఒవెల్ పిచ్ ఫేసర్లకు సహకరించడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే ఇండియా ఈ మ్యాచ్ కు ముగ్గురు పేసర్లను మరియు ఒక స్పిన్నర్ ను తీసుకుంటుంది.
స్పిన్నర్ గా అశ్విన్ కన్నా జడేజా వైపే టీం ఇండియా యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది అని వెటోరీ తెలిపాడు, మరి ఇతను చెప్పినట్లే జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే.