ఇప్పుడున్న సీనియర్ హీరోలలో వెంకటేష్ ది విభిన్న మైన శైలి. మిగిలిన వారి కంటే ఎప్పుడో తాను డ్యూయెట్ లకు బాయ్ చెప్పారు. అదీ కాక కథలో హీరో ఇజం లేక పోయినా కథను మాత్రమే నమ్మి చేసే వ్యక్తి. అంతే కాకుండా జీవితం అంటే సినిమాలే కాదని జీవితం అంటే ఎంజాయ్ చేయటం, ఆధ్యాత్మిక భావం తో ఉండడం అని చెబుతారు. ప్రస్తుతం ఆయన కరోనా కాలంలో ఓటిటి లో రిలీజ్ అయిన సినిమాని థియేటర్స్ లో కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆయన తాజాగా రీమేక్ చేసిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘నారప్ప అప్పట్లో కరోనా కారణంగా అలాగే ఓటిటి మంచి రేటు రావటం వల్ల థియోటర్ రిలీజ్ కాలేదు. అక్కడ కూడా సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.కాని ఎక్కడో వెంకీ , ఆయన అభిమానులకు థియేటర్స్ లోకి సినిమా వేస్తే బాగుండేది అని చాలా సార్లు వ్యాఖ్యానించారు . రీసెంట్ గా వచ్చిన F3 లో కూడా ఆ చిత్రం సన్నివేశం పెట్టి కోరిక తీర్చుకున్నాడు.
ఇక ఆ సినిమా థియేటర్స్ లోకి రిలీజ్ అయ్యే ఆయన కోరిక నెరవేరే టైమ్ వచ్చింది. తాజా సమాచారం మేరకు వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సురేష్ ప్రొడక్షన్ సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రా,తెలంగాణాలలో ఈ సినిమాని వెంకటేష్ అభిమానులు కోసం డిసెంబర్ 13న థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. దీనితో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.