శివ‌రాత్రికి భ‌క్తుల‌కు ఏ స‌మ‌స్యా రానీయొద్దు – మంత్రి విడ‌ద‌ల ర‌జిని

-

శివ‌రాత్రికి భ‌క్తుల‌కు ఏ స‌మ‌స్యా రానీయొద్దన్నారు మంత్రి విడ‌ద‌ల ర‌జిని. కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల‌కు వచ్చే భ‌క్తుల‌కు ఎలాంటి స‌మ‌స్యలు రానీయ‌కుండా చూడాల్సిన బాధ్య‌త అధికార యంత్రాగానిదేన‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు స్ప‌ష్టం చేశారు. ఈ నెల 18వ తేదీన శివ‌రాత్రిపండుగ, కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల నేప‌థ్యంలో చిల‌క‌లూరిపేట నుంచి కొండ‌కు వెళ్లే రోడ్ల‌ను మంత్రి విడ‌ద‌ల ర‌జిని  ప‌రిశీలించారు.

మంత్రి వెంట క‌లెక్ట‌ర్ లోతేటి శివ‌శంక‌ర్ గారు, డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్‌ గారు, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఉన్నారు. రెవెన్యూ, ఆర్అండ్‌బీ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్ శాఖ‌ల అధికారులు వ‌చ్చారు. పురుషోత్త‌మ‌ప‌ట్ట‌ణం నుంచి య‌డ‌వ‌ల్లి వ‌ర‌కు కోట‌ప్ప‌కొండ రోడ్డును మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు ప‌రిశీలిస్తూ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ కోట‌ప్ప కొండ తిరునాళ్ల‌కు భ‌క్తులు చిల‌క‌లూరిపేట నుంచి పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివెళ్తార‌ని చెప్పారు. కోట‌ప్ప‌కొండ‌కు భారీగా ప్ర‌భ‌ల‌ను త‌ర‌లిస్తార‌ని, చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎక్కువ‌గా తిరునాళ్ల‌కు ప్ర‌భ‌లు వెళ్తాయ‌ని చెప్పారు. భ‌క్తుల‌కు, ప్ర‌భ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చూడాల్సిన బాధ్య‌త అధికార యంత్రాగానిదేన‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news