తగ్గేదేలే.. బ్లాక్ శారీలో ‘శ్రీవల్లి’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన విద్యాబాలన్..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’.. బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి అందరికీ విదితమే. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్, డ్యాన్స్ స్టెప్స్, హీరో సిగ్నేచర్ మూమెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నప్పటికీ సెలబ్రిటీలు ఇంకా ఈ చిత్ర మేనియాలోనే ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ విద్యాబాలన్ ‘పుష్ప’ మూవీలోని ‘శ్రీవల్లి’ సాంగ్‌కు గాను గ్రేస్ ఫుల్ స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా షేర్ చేయగా, ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

డీ గ్లామరైజ్డ్ రోల్స్‌లో అల్లు అర్జున్, రష్మిక మందనల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా ఈ సినిమాకు మంచి మార్కులే వేశారు. ఇకపోతే చిత్రంలోని ‘శ్రీవల్లి’ పాటకు క్రికెటర్లు, కొరియోగ్రాఫర్లు, పైలట్లు, ఇతర అన్ని రంగాలకు చెందిన వారు డ్యాన్స్ స్టెప్పులేసి వావ్ అనిపించారు. విద్యాబాలన్ కూడా ఈ జాబితాలోకి తాజాగా చేరిపోయింది. పూర్తి నలుపు రంగు అవుట్ ఫిట్‌లో శారీ, బ్లౌజ్ మ్యాచింగ్ గాగుల్స్, వాచ్ ఇతరాలు ధరించి విద్యాబాలన్.. గ్రేస్ ఫుల్ స్టెప్స్ వేసింది. ఈ వీడియో చూసి ‘పుష్ప’ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక విద్యా బాలన్ సినిమాల విషయానికొస్తే.. ఈమె నటించిన ‘జల్సా’ సినిమా ఇటీవల విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Vidya balan (@vidya_balan__)

 

 

Read more RELATED
Recommended to you

Latest news