తమిళ హీరో, డైరెక్టర్ మరియు నిర్మాత అయిన విజయ్ ఆంథోనీ ఫలితం తో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యనే బిచ్చగాడు 2 సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందనను దక్కించుకుంది, ఈ సినిమా గతంలో బిచ్చగాడు పేరుతో విడుదల అయ్యి ఘన విజయం అందుకున్న సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. ఇప్పుడు మరో సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సిద్దం అవుతున్నాడు. ఇతను నటిస్తున్న లేటెస్ట్ సినిమా “హత్య”. కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ నీ ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమాను ఎంతో నమ్మకంతో బాలాజీ కుమార్ అనే డైరెక్టర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ ఆంథోనీ తో పాటుగా మీనాక్షి చౌదరి, రితికా సింగ్, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ తదితరులు స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారు.
కాగా ఈ సినిమా ఈ నెల 21 వ తేదీన విడుదల చేయనున్నారు. విజయ్ అంతోనీ ఈ సరైన హిట్ ను అందుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే మరో మూడు రోజుల వరకు ఆగాల్సిందే.