మద్యం మత్తులో యువతుల వీరంగం.. పోలీసులతో వాగ్వాదం

-

మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియదు కొంత మందికి. తాగి నానా యాగి చేస్తుంటారు. రోడ్డుపైనే ప్రతి ఒక్కరితో గొడవపెట్టుకుంటారు. అయిన దానికి కాని దానికి గొడవ పడుతూ.. కోట్లాటకు దిగుతారు. పీకల దాకా తాగి, అర్థరాత్రుళ్లు ఒళ్లు మరచి రోడ్డపై హంగామా సృషించే తాగుబోతులను అనేక మందిని చూసుంటాం. ఇళ్లు, ఒళ్లు గుళ్లవుతున్నా పట్టించుకోకుండా.. మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో మహిళలు సైతం తామేమీ తక్కువ తాగేడం లేదని నిరూపిస్తున్నారు. పార్టీలు, పబ్ కల్చర్ అలవాటు పడ్డాక.. రాత్రిళ్లు పొద్దుపోయేదాకా మద్యం సేవించి.. వాహనాలు నడపడం, మధ్య దారిలో ఎవ్వరితో ఒకరితో గొడవ పడటం పరిపాటిగా మారిపోయింది. తాజాగా అటువంటి వీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ముగ్గురు మహిళలు మద్యం మత్తులో రెచ్చిపోయారు. మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న యువతులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు..వారిని ఇండ్లకు వెళ్లిపోవాలని సూచించారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన యువతులు..పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనను ఓ మహిళా కానిస్టేబుల్ వీడియో తీస్తుండగా…ఆ ఫోన్ ను తీసుకుని నేలకేసి కొట్టారు. ఈ ఘటనను స్థానికులు కూడా వీడియో తీస్తుండగా..వారిపై కూడా యువతులు దాడి చేశారు. అనంతరం ఘటనా స్థలానికి ఓ మహిళా పోలీసు అధికారి వచ్చారు. అనంతరం ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతుల కుటుంబాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు..వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news