లోక్ సభ ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలు అరెస్ట్ అవుతారని ఢిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. వారిలో తాను కూడా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. కోర్టులో ఈడీ.. సౌరభ్, నా పేరు ప్రస్తావించింది. ఈ స్టేట్మెంట్ సీబీఐ, ఈడీ వద్ద ఎప్పటి నుంచో ఉంది. కానీ, దానిని ఇప్పుడు బయటపెట్టడానికి కారణం.. కేజీవాల్, మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్టు తర్వాత కూడా ఆప్ ఐక్యంగా ఉందని బీజేపీ భావించడమే. దాంతో వారి తర్వాత వరుసలో ఉన్న నేతలను జైలులో పెట్టేందుకు యత్నిస్తోంది. నా రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి తమ పార్టీలో చేరాలని ఒక వ్యక్తి ద్వారా బీజేపీ నన్ను సంప్రదించింది. లేకపోతే డీ అరెస్టు చేస్తుందని ఆ వ్యక్తి ద్వారా చెప్పించింది” అని ఆరోపించారు.
మద్యం కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయన సీఎం పదవీకి రాజీనామా చేస్తారా..? అంటూ అడిగిన ప్రశ్నకు ఆతిశీ బదులిచ్చారు. అందుకు ఎలాంటి కారణం లేదన్నారు.