కార్పొరేట్ కంపెనీలతో టై అప్ అవుతున్న రౌడీ స్టార్…!

-

ఓ వైపు బ్రాండ్ అంబాసిడార్ గా నోటెడ్ అవుతూనే కార్పొరేట్ కంపెనీలతో టై అప్ అవుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. లోకల్ యాడ్ లతోనే కాకుండా కార్పొరేట్ యాడ్ లలోను కనిపిస్తున్నాడు.ఇప్పటికే కియరాతో కలిసి మెబాజ్ కోసం అదిరిపోయే యాడ్ షూట్ లో పాల్గొన్నాడు.ఇదనే కాకుండా బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా…అక్కడి మీడియా హౌస్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఇవన్నీ విజయ్ దేవరకొండ రేంజ్ ను అంతకంతకు పెంచేస్తున్నాయి.


రౌడీ స్టార్ ముందు నుంచి యునీక్ గా ఉండడానికే చూస్తున్నాడు.అగ్రెస్సివ్ గా ఉంటూనే తనదైన ఆటిట్యూడ్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు.ఆ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడు.ఇప్పటికే బిటౌన్ బ్యూటీలు కూడా టాలీవుడ్ పేరు చెప్పగానే ఈ మధ్య విజయ్ దేవరకొండనే గుర్తు చేసుకుంటున్నారు. ఇతగాడి స్టయిల్ కు బాలీవుడ్ భామలు ఫిదా అయిపోయారు.మహేష్ ,బన్నీలకు ధీటుగా బ్రాండ్ అంబాసిడార్ గాను అవతరించాడు. ఇప్పటికే రౌడీ స్టార్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ లో సక్సెసైన ఈ అగ్రెస్సివ్ హీరో…ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలోకి అడుగు పెట్టాడు.హీరోగారి మూమెంట్స్ ,బిజినెస్ ఐడియాలను నిశితంగా పరిశీలిస్తున్న నేటితరం స్టార్టప్స్.. ఈ విషయంలో విజయ్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news