నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ..!

-

కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌‌లో హీరో విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్టర్‌ను విజయ్ లాంచ్ చేసారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ “పోయిన నెల మాకు తెలిసిన వ్యక్తులకు కరోనా రాగా ప్లాస్మా ఎక్కడా దొరకలేదు. అప్పుడు ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది. ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్  ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడ వచ్చు.

ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు. 200 మంది రోగుల‌ను కాపాడాం. ప్లాస్మా దానం చేసిన వారు కరోనా యోధులు..వాళ్ళు దేవుడితో సమానం. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు. అలాగే ప్లాస్మా డొనేట్ చేయాలనుకుంటే donateplasma.scsc.in అనే వెబ్‌సైట్ చూడమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news