బాల‌య్య “బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్” కు రౌడీ హీరో..!

-

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య ప్ర‌స్తుతం హోస్ట్ గా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ పేరుతో షో చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ షో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుండ‌గా న‌వంబ‌ర్ 4 నుండి షో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ షోకు గెస్ట్ గా మొద‌టి ఎపిసోడ్ లో మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ షో గురించి మ‌రో వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే ఈ షోలో గెస్ట్ గా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా రాబోతున్నార‌ట‌.

ప్ర‌స్తుతం విజయ్ తో బాల‌య్య ఇంట‌ర్యూ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. ఇక రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక బాల‌య్య రౌడీ హీరోను ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుతారో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version