సంగారెడ్డి జిల్లాలో 10 రోజుల వ్యవధిలో మరోసారి భూకంపం వచ్చింది. న్యాల్కల్ మండలంలో జనవరి 27న భూకంపం సంభవించగ.. కాసేపటి క్రితం మరోసారి పలు చోట్ల భూమి కంపించింది.
5 సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కనిపించడంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు.భూ ప్రకంపనలు పది రోజుల వ్యవధిలో రెండుసార్లు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
ఇంతకుముందు.. న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కాగా.. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం ఏమి జరగలేదని సమాచారం. కానీ.. జిల్లాలో భూకంపం అనగానే ప్రజలు వనికిపోతున్నారు.