విజ‌య్ సేతుప‌తి.. కాతు వాకుల రెండు కాద‌ల్ టీజ‌ర్ అవుట్

-

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, టాలీవుడ్ హీరోయిన్లు స‌మంత‌, నయ‌న‌తార జంట గా వ‌స్తున్న సినిమా కాతు వాకుల రెండు కాద‌ల్. విఘేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. కాగ ఈ సినిమా టీజ‌ర్ ను కాసేప‌టి క్రితం చిత్ర బృందం ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేసింది. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ గా ఈ కాతు వాకుల రెండు కాద‌ల్ సినిమాను వ‌స్తుంది. హీరోయిన్లు స‌మంత, న‌య‌నతార తో పాటు విజ‌య్ సేతుప‌తి కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంత ద‌గ్గ‌ర కావడంతో ఈ సినిమా కోసం కొంత మంది తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

రోమాంటిక్ కామెడీగా వ‌స్తున్న ఈ సినిమా టీజ‌ర్ లో కూడా ఫుల్ కామెడీ ఉంది. విజ‌య్ సేతుప‌తి చేసే కామెడీ అల‌రిస్తుంది. కాగ ఈ టీజ‌ర్ తో ఈ సినిమా పై అంచ‌నాలు భారీగానే పెరిగాయి. కాగ ఈ సినిమాను విఘ్నేష్ శివ‌న్ తో పాటు న‌య‌నతార కూడా నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తుంది. అలాగే ఈ సినిమా కు అనిరుధ ర‌వి చంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగ ఈ సినిమాలో స‌మంత పాత్ర‌కు ముందుగా త్రిషను అనుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల త్రిష త‌ప్పుకోవ‌డంతో స‌మంత రంగంలోకి దిగింది. కాగ ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news