SSC Exams : ప‌దో త‌ర‌గతి ప‌రీక్షల షెడ్యూల్​ విడుదల

-

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అలర్ట్. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కాసేప‌టి క్రితం విడుద‌ల చేసింది. అంద‌రూ ఊహించిన‌ట్టు గానే మేల‌లోనే ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్షలు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణ‌యం తీసుకుంది. మే 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే మే నెల 18 వ తేదీ నుంచి 20 వ తేదీ వ‌ర‌కు ఓఎస్ఎస్సీ, ఓకేషన‌ల్ ప‌రీక్షలు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

ప‌రీక్షలు అన్నీ కూడా ఉద‌యం 9 : 30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 : 45 గంటల వ‌ర‌కు జ‌రుగుతాయి. అలాగే పరీక్షలు 11 వ తేదీ నుంచి వ‌రుస తేదీ ల‌లో జ‌ర‌గ‌నున్నాయి. కాగ 15 వ తేదీ రోజు ఆదివారం కావ‌డంతో మ‌ధ్య‌లో ఒక రోజు గ్యాప్ ఉండ నుంది.

అదే విధంగా రాష్ట్ర విద్యా శాఖ ఆరు పేప‌ర్ల‌ కే షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తిలో 11 పేప‌ర్లు ఉండేవి. కానీ ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం పేప‌ర్ల సంఖ్య ను 11 నుంచి 6 కు త‌గ్గించింది. దీంతో స‌బ్జెక్ట్ కు ఒక పేప‌ర్ మాత్ర‌మే ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news