మరోసారి పెరిగిన విజయ పాల ధర.. నేటి నుంచే అమలు

-

ప్రస్తుతం మన దేశం లో పెట్రోల్‌, డిజీల్‌, వంట నూనెలు, వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెట్రోల్‌, వంట గ్యాస్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపించేలా ఓ రేంజ్‌ లో పెరిగి పోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. సామన్య ప్రజలపై మరో పెను భారం పడనుంది.

తెలంగాణ రాష్ట్రంలో బాగా పాపులర్‌ అయిన విజయ పాల ధరలు పెరిగి పోయాయి. లీటర్‌ విజయ పాలపై రూ. 2 పెరిగాయి. ఈ పెరిగిన ధరలు ఇవాళ్టి అంటే ఏప్రిల్‌ 15 వ తేదీ నుంచే అమలు కానున్నట్లు ప్రకటన కూడా వెలువడింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో.. విజయ పాలు లీటర్‌ ధర 49 రూపాయలు ఉండగా.. ఇవాళ్టి నుంచి 51 రూపాయలు కానుంది. ఈ పెరిగిన ధరల ద్వారా వచ్చే ఆదాయాన్ని పాల రైతులకు ఎదో ఓ రూపంలో సహాయంగా అందిస్తామని విజయ పాల సహాకార సంఘం పేర్కొంది. కాగా.. జనవరి 1 వ తేదీన లీటర్‌ రూ.2 పెంచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news