షర్మిల పర్మినెంట్‌ అడ్రస్‌ పాలేరు – వైఎస్‌ విజయమ్మ

-

మాకు పులివెందుల ఎలాగో, షర్మిలకు పాలేరు అలాంటిదేనని వైఎస్ విజయమ్మ అన్నారు. జూలై 8 న ఖమ్మం జిల్లా పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం చేయనున్నామని… జనాలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమించారన్నారు.

25 సంవత్సరాల పాటు జనం కోసం పరితపించారని..వైఎస్ఆర్ ఎన్ని అవమానాలు జరిగిన ప్రజల కోసం పని చేశారని ఫైర్‌ అయ్యారు. మాట తప్పితే ప్రాణం పోయినట్లుగా బావించే వారని..వైఎస్సాఆర్‌ ముద్దుల బిడ్డ ఈ గడ్డ కోసం షర్మిల వచ్చిందన్నారు.

కారులో నుంచి క్రేన్ లో పెట్టీ తీసుకుని వెళ్లారు.. అరెస్ట్ లు చేశారు అయిన వెనుకంజ వేయని మహిళ షర్మిల అని కొనియాడారు. ప్రజల కోసం ఎన్నో ఆవమానాలు భరించి, ప్రజల కోసం షర్మిల యాత్ర చేస్తుందని…షర్మిల అడ్రస్‌ పాలేరు అయ్యిందని చెప్పా రు. తెలంగాణకు గుమ్మం ఖమ్మం అని.. మాట ఇస్తే తప్పని మహిళ షర్మిల అని తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుందని వివరించారు వైఎస్ విజయమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news