ఏపీ పథకాలపై విజయసారెడ్డి సంచలన ట్వీట్

-

 

ఏపీ సంక్షేమ పథకాలపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బును లక్షిత లబ్ధిదారులకు చేర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విస్తృతంగా అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు (ప్రయోజన) బదిలీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌–డీబీటీ) ప్రక్రియ బాటలోకి ఇప్పుడు కర్ణాటక సర్కారు వచ్చి చేరుతోంది. ఇప్పటికే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా ఈ నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోందన్నారు.

 

అయితే, డీబీటీ ప్రక్రియను విస్తృతంగా వినియోగించుకుంటూ ఎలాంటి అవినీతి, డబ్బు లీకేజీ లేకుండా చూస్తున్న అత్యత్తుమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని ఇప్పుడు అందరూ గుర్తుస్తున్నారు. ఇండియాలో డీబీటీ ప్రక్రియను గరిష్ఠ స్థాయిలో జనం కోసం ఉపయోగిస్తున్నది బహుశా ఆంధ్రప్రదేశ్‌ కావచ్చని ప్రముఖ ఇంగ్లిష్‌ డైలీ ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ గ్రామీణ, వ్యవసాయ వ్యవహారాల ఎడిటర్‌ హరీష్‌ దామోదరన్‌ తన తాజా కథనంలో అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో 2019లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023 మార్చి నెల వరకూ 28 ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల కింద కోట్లాది మంది లబ్ధిదారులకు అంతా కలిపి రూ. 2,10,177.89 కోట్లను వారి బ్యాంకు అకౌంట్లలోకి బదిలీచేశారన్నారు.

 

‘అత్యధిక ప్రత్యక్ష నగదు బదిలీ అయిన పథకాల్లో ప్రధానమైనవి: వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక (వృద్ధులు, సాయం అవసరమైన వర్గాలకు దీని కింద రూ.70,318.84 కోట్లు), వైఎస్సార్‌ ఆసరా, వ్యాపారంలోకి దిగినవారు, స్త్రీలు,స్వయం శక్తి గ్రూపులకు సున్నా వడ్డీ, చేయూత పథకాల కింద రూ. 36,922.57 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసా (రూ.27,062.08 కోట్లు), జగనన్న అమ్మ ఒడి (తక్కువ ఆదాయం గల కుటుంబాల స్కూలు పిల్లల తల్లులకు ఏటా రూ.1500 చొప్పున ఇప్పటికి రూ.19,674.34 కోట్లు), జగనన్న విద్యాదీవెన (ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు కోసం రూ.9,947.84 కోట్లు), డా.వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ (పేదలకు కుటుంబానికి లేదా ఏడాదికి క్యాష్‌ లెస్‌ ఆరోగ్య బీమా కింద రూ.8,845.53 కోట్లు)’ అని ఆయన తన వార్తావ్యాసంలో వివరించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news