ప్రతి ఒక్కరు కూడా పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. పోషకాహారాన్ని తీసుకోకపోతే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అన్ని రకాల పోషక పదార్థాలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. మెగ్నీషియం, కాలుష్యం, జింక్ మొదలైన పోషక పదార్థాలు డైట్లో చేర్చుకోండి అయితే క్యాల్షియం తక్కువగా ఉండడం వలన రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కండరాల నొప్పులు నీరసం మొదలైనవి క్యాల్షియం లోపం వలన వస్తూ ఉంటాయి.
అయితే కేవలం పాలల్లో మాత్రమే క్యాల్షియం ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు క్యాల్షియంని పొందాలంటే పాల తో పాటుగా ఈ ఆహార పదార్థాలు కూడా తీసుకోవచ్చు. క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి బెనిఫిట్స్ ని పొందవచ్చు. పాలు బాదం మొదలైన వాటిల్లో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది ఎముకలు దృఢంగా ఉండాలంటే పాలని కచ్చితంగా రోజు తీసుకుంటూ ఉండాలి. అలానే పాలతో పాటుగా గింజలని కూడా డైట్లో తీసుకుంటూ ఉండాలి. గింజలలో క్యాల్షియం ఉంటుంది ఎముకలు దృఢంగా మారుస్తుంది.
కొందరికి పాలు తాగడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు పెరుగును తీసుకోవడం వలన కాల్షియం ని పొందొచ్చు క్యాల్షియం లోపాన్ని 23% పెరుగు తగ్గిస్తుంది. ఫిజ్ ని కూడా తీసుకోవచ్చు. ఫిజ్ని (figs) తీసుకోవడం వలన కూడా మీరు క్యాల్షియంని పొందవచ్చు. బాదం ద్వారా కూడా కాల్షియంని పొందవచ్చు. ఇలా క్యాల్షియం లోపం నుండి బయట పడొచ్చు ముఖ్యంగా ఆడవాళ్లు క్యాల్షియం లోపం వలన సతమతమవుతున్నారు అనేక మార్గాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా మీ సమస్యని లైట్ తీసుకోకండి. వీటిని చేర్చుకుంటే సమస్యే ఉండదు.