రైతన్నల బాధ‌లు నీకేమీ ప‌ట్ట‌డం లేదు కదా? – విజయశాంతి

-

రైతన్నల బాధ‌లు నీకేమీ ప‌ట్ట‌డం లేదు కదా? అని కేసీఆర్‌ పై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎప్పుడు చెప్పే మాట మాది రైతు ప్ర‌భుత్వమని… కానీ చేతల్లో మాత్రం శూన్యం. కృష్ణానది ఎగువ పరీవాహకంలో వచ్చిన వరదలకు రెండేళ్ల కిందట కల్వకుర్తి ఎత్తిపోతల మునిగిపోయింది. పంప్ హౌస్‌లోని ఐదు మోటార్లూ నీట మునిగాయి. కానీ, కేసీఆర్ స‌ర్కార్ ఇంత వ‌ర‌కు వాటిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ)లో పంప్ హౌస్‌ మునిగి రెండేళ్లు గడిచినా మరమ్మతులు పూర్తి చేయలేదు. రెండు మోటార్లకు మాత్రమే మరమ్మతులు పూర్తయ్యాయి. కనీసం మూడో మోటారుకు మరమ్మతు పూర్తయితేనే కాల్వలకు సరిపడా నీరు విడుదలై ఆయకట్టుకు అందుతుంది. ఏం కేసీఆర్… ప్ర‌తి ఎకరాకు నీరు ఇస్తామ‌ని గొప్ప‌లు చెప్పావు, ఇప్పుడు ఉన్న మోటార్లకి కుడా మ‌ర‌మ్మ‌తులు చేస్తలేవని నిలదీశారు.

రైత‌న్న‌లు ప‌డుతున్న బాధ‌లు నీకేమీ ప‌ట్ట‌డం లేదు కదా?… ఇక నాలుగో మోటారు, స్టాండ్‌ బైగా ఉండే ఐదో మోటారు మరమ్మతుల గురించి అస‌లే పట్టించుకోవట్లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నమని ప్రకటిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం… రెండేళ్లు గడిచినా కేఎల్‌ఐ లిఫ్టులో మూడో మోటారునైనా వినియోగంలోకి తీసుకురాకపోవడం దుర‌దృష్ట‌క‌రం. ఇప్ప‌టికైనా వెనుకబడిన పాలమూరు జిల్లాకు ప్రధాన నీటి వనరుగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్ల‌ను బాగు చేయించాలని బీజేపీ త‌రుపున డిమాండ్ చేస్తున్నం. రైత‌న్నల జీవితాల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కారుకి తెలంగాణ రైతాంగ‌ం కచ్చితంగా త‌గిన బుద్ధి చెబుతుందని విజ‌య‌శాంతి ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news