బెజవాడ ఫాతిమా మిస్సింగ్ కేసును కొత్తపేట పోలీసులు ఛేధించారు కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఫాతిమా మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. అందువల్ల నింధితుడు వాసిబ్ ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి ఫాతిమాకు మానసిక వైద్యం చేసాడు. అనంతరం వాసిబ్ తో కలిసి ఫాతిమా విజయవాడ నుండి యూపీ వెళ్ళింది. ఢిల్లీ నుండి శహరన్ పూర్ కు వెళ్ళడానికి బుక్ చేసిన టికెట్ మెసేజ్ ద్వారా పోలీసులు గుర్తించినట్టు తెలిపారు.
వాసిబ్ మొదటి భార్య గొడవ పడటంతో అతడు ఫాతిమా ను వదిలించుకోవాలని చూసాడని తెలిపారు. వాసిబ్ తన స్నేహితుడు తయ్యబ్ తో కలిసి ఫాతిమాను హత్నికుండ్ జలాశయంలో తోసాడు. అదే జలాశయంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఫాతిమా మృతదేహం దొరికింది. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నిందితులను విజయవాడ తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచామని..14 రోజుల రిమాండ్ విధించారని చెప్పారు. ప్రస్తుతం నింధితులను మచిలీపట్నం జైలుకు తరలించినట్టు తెలిపారు. వాసిబ్ వద్ద 60 గ్రాముల బంగారం దొరికిందన్నారు.