బ్రేకింగ్‌ : లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా… షెడ్యూల్ కంటే ముందే

-

ఢిల్లీ : లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా పడింది. ముందు అనుకున్న షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే లోక్‌ స‌భ నిర‌వ‌ధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వ‌ర‌కు పార్లమెంట్ స‌మావేశాలు జ‌ర‌గాల్సి ఉండేది. కానీ పెగాసెస్‌ మరియు వ్యవసాయ చట్టాలపై విప‌క్ష పార్టీలు చేసిన ఆందోళ‌న నేప‌థ్యంలో లోక్‌ సభ నిర‌వ‌ధిక వాయిదా పడింది.

ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు కేవలం 17 రోజుల పాటు కొన సాగాయి. అయితే… ఈ వర్షాకాల సమావేశాల్లో కొత్త వ్యవసాయ చట్టాలు మరియు పెగసెస్‌ పై చర్చకు పట్టుపట్టాయి విపక్ష పార్టీలు. అయితే… రాజ్యాంగ సవరణ బిల్లు అమోదానికి విపక్ష పార్టీలు సహకరించలేదు. ఇక అటు రాజ్య సభ 12 గంటల వరకు వాయిదా పడింది. సభలో కార్యకలాపాల అడ్డగింతపై రాజ్య సభలో ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి పరిస్థితులు తాను ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news