సీఎం సీటులో కేటీఆర్‌…డిసైడ్ అయ్యేది అప్పుడేనా?

-

అదిగో కేటీఆర్‌కు కేసీఆర్ సీఎం సీటు ఇచ్చేస్తున్నారు…రేపో మాపో ప్రమాణస్వీకారం కూడా జరిగిపోతుందని మొన్న ఆ మధ్య మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఇటు అధికార టీఆర్ఎస్ నేతలు కూడా…కేటీఆర్‌కు బాగానే భజన చేశారు. కేటీఆర్ సీఎం అయితే తప్పు ఏంటి అని కూడా అన్నారు. మరి ఏమైందో తెలియదు గానీ, కేటీఆర్‌ని సీఎం చేసే కార్యక్రమం బ్రేక్ పడింది.

ktr
ktr

వచ్చే ఎన్నికలు వరకు కేసీఆరే సీఎంగా కొనసాగనున్నారని అర్ధమవుతుంది. అయితే దీని వెనుక కూడా ఓ వ్యూహం ఉందని తెలుస్తోంది. మధ్యలో కేటీఆర్‌కు సీఎం సీటు ఇస్తే, ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా పడినట్లు కనబడుతోంది. కానీ కేటీఆర్‌ని సీఎం పీఠంలో కూర్చోబెట్టడం ఖాయమని, అది నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహామని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల మాదిరిగానే కేసీఆర్ మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా ఉన్నారని, అప్పుడు గెలిచి అధికారంలోకి వస్తే కేటీఆర్ పట్టాభిషేకం జరుగుతుందని అంటున్నారు. ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారని చెబుతున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్ ఇదే తరహా రాజకీయం చేయడానికి చూశారని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ పప్పులు ఉడకలేదని, కేంద్రంలో బీజేపీ సొంత మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్ వ్యూహం వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు.

కానీ ఈ సారి కేంద్రంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ మళ్ళీ అదే తరహా వ్యూహంతో ముందుకెళ్లనున్నారని చెబుతున్నారు. కాకపోతే రాష్ట్రంలో కూడా కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్న విషయం గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సారి కేసీఆర్‌కు అధికారంలోకి రావడం అంత సులువు కాదనే చెప్పాలి. మరి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news