కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాహుల్ ఈడి విచారణపై విజయసాయి రెడ్డి స్పందించారు. కర్మ సిద్దాంతం తో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందే అంటూ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం కక్ష్య సాధింపు చేయట్లేదని.. సుబ్రమణ్య స్వామి వేసిన పిల్ పైనే విచారణ జరుగుతోందని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. సుబ్రహ్మణ్య స్వామి పిల్ కు రాజకీయాలు అపాదించొద్దని పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. ఇక మరోవైపు టీడీపీ పార్టీపై విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి. టెన్త్ పిల్లలను రెచ్చగొట్టి ‘దేనికోసమో’ చేసిన ప్రయత్నాలు ‘ఫెయిల్’ అయ్యాయి. ఇప్పుడు గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలపై కుట్రలు చేస్తున్నారు నికృష్టపు తుప్పు, పప్పులు….పుల్లలు పెట్టడం జన్యురీత్యా వచ్చిన నక్క బుద్ధి వీళ్ళకి. తుప్పు హయాంలో APPSC ని తన చెంచాలతో నింపేశాడని ఆగ్రహించారు.