ఇర‌వై ఏళ్ల “జ‌యం”  ఏం చెబుతోంది ?

-

చిన్న సినిమా తీయాలి. హీరో కొత్త‌వాడు.. హీరోయిన్ కొత్త అమ్మాయి. వీలున్నంత వ‌ర‌కూ అంతా కొత్త వారే.. తేజా చేస్తున్న ప్ర‌యోగం. ఓ మామూలు ప్రేమ క‌థ‌కు త‌న‌దైన ట్రీట్మెంట్. క‌థ అప్ప‌టికేం కొత్త‌ది కాదు. ఆ ఫార్ములా కూడా కొత్త‌ది కాదు. కానీ కొత్త‌వాళ్లంతా ఆ సినిమాలో చేరి కొత్త‌ద‌నం నింపారు. అంద‌మ‌యిన మ‌న‌సులో ఇంత అలజ‌డి ఎందుకు? అని ప్ర‌శ్నించి, ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.  ఆ విధంగా నితిన్..ఆవిధంగా స‌దా.. ఆ విధంగా వైజాగ్ కుర్రాడు సుమ‌న్ శెట్టి..ఇంకా ఓ అర‌వై మందికి పైగా కొత్త కుర్రాళ్లు..

విల‌న్ కావాలి.. ప్రేమ క‌థ‌కు విల‌న్ మాత్ర‌మే కావాలి. ఆ మాత్రమే ద‌గ్గ‌ర ఆగిపోయాడు. కొత్త‌గా చేయ‌గ‌ల‌గ‌డం ఓ నేర్పు. త‌న‌దైన క్రౌర్యం.. నిండిన క‌ళ్ల‌తో అస్స‌లు జాలీ ద‌యా లేని విధంగా ఓ లేత కుర్రాడ్ని కొట్టాలి.. ఇంకా చెప్పాలంటే ఏ విలువ‌లూ లేని పాత్ర అది.. మూర్ఖ‌త్వం నిండిన పాత్ర అది. ఆ విధంగా సీన్లోకి సీనియ‌ర్ ద‌ర్శ‌కులు టి.కృష్ణ అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. పేరు : గోపీచంద్. అప్ప‌టికే ముత్యాల సుబ్బ‌య్య డైరెక్ష‌న్లో ఓ సినిమా చేసినా పెద్ద‌గా పేరు రాలేదు. మ‌లి ప్ర‌య‌త్నంలో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు.సూప‌ర్ సక్సెస్ కొట్టాడు.
పాట‌లు కుల‌శేఖర్ రాశారు. అప్ప‌టిదాకా చిత్రం సినిమాతో వ‌చ్చిన ఇమేజ్ ను మ‌రింత పెంచేస్తూ ఈ  సినిమాకు పాట‌లు రాశారు.చిన్న చిన్న బిట్ సాంగ్స్ తో క‌లుపుకుని మంచి సాహిత్యం అందించారు. ముఖ్యంగా రైలు బండి మీద పాట‌ను సంబంధిత శాఖ వారు ఒప్పుకోలేదు. దాంతో సాహిత్యం మార్చి విడుద‌ల చేశారు. బండి బండి రైలు బండి వేళ‌కంటూ రాదులేండి దీన్ని కాని న‌మ్ముకుంటే  ఇంతేనండి ఇంతేనండి అని రాశారు.. కానీ త‌రువాత ఆ వ‌రుస‌లు మార్చి బండి  బండి రైలు బండి ఎంత మంచి రైలు బండి.. అంటూ రాశారు. అదేవిధంగా ఈ  సినిమాకు కొరియోగ్రఫ‌ర్ గా శంక‌ర్ ప‌నిచేశారు.
కొత్త కుర్రాళ్ల‌తో ఎంత బాగా స్టెప్పులు  వేయించారో ! ఈ సినిమాలో సునీతతో సదా పాత్ర‌కు డబ్బింగ్ చెప్పించారు. వెళ్లవ‌య్యా వెళ్లు వెళ్లూ.. అంటూ ఆమె ప‌లికే  డైలాగ్ ఇప్ప‌టికీ  సంచ‌ల‌న‌మే !  కాల గ‌తిలో ఇర‌వై ఏళ్లు గ‌డిచిపోయాయి. ఇప్పుడు నితిన్ హీరోగానూ మ‌రియు నిర్మాత‌గానూ రాణిస్తున్నారు. జ‌య‌ప‌జయాలకు అతీతంగా సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. స‌దా మాత్రం బుల్లితెర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోయింది. సుమ‌న్ శెట్టి లాంటి వాళ్లంతా ఎక్క‌డున్నారో మ‌రి ! సంగీతం అందించిన ఆర్పీ కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో అంత యాక్టివ్ గా లేరు. ఇప్పుడిప్పుడే కొన్ని కొత్త ప్ర‌యత్నాలేవో చేస్తున్నారాయ‌న. ఓ విధంగా సినిమా ద‌ర్శ‌కుడిగానూ, నిర్మాత‌గానూ తేజ జీవితాన్నే మార్చింది. అటుపై ఆయ‌న ఇంత‌టి స్థాయిలో విజ‌యాలు అయితే అందుకోలేక‌పోయారు అన్న‌ది మాత్రం వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version