వచ్చే రిపబ్లిక్ డే కి విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్

-

కోలీవుడ్ స్టార్ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా తంగలాన్. ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను ట్విట్టర్ పంచుకున్నారు. నవంబర్ 01న టీజర్ ను విడుదల చేస్తామని వెల్లడించారు. అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ మూవీ.

ఈ చిత్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. మాళవిక మోహనన్ ఇందులో కథానాయిక గా నటిస్తుంది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news