తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ నగరంలోని బస్తీ దవాఖానల తరహాలోనే… గ్రామ దవాఖాన లు కూడా త్వరలోనే రాబోతున్నాయని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ గ్రామ దవాఖానల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని… త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా… ఆ ఆస్పత్రుల్లోకే వెళ్లేలా చర్యలు చేస్తామన్నారు. దీని కారణంగా గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు లాభం చేకూరుతుందని చెప్పారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామ పంచాయతీ దారుణంగా ఉన్నాయని.. అసలు మంచినీళ్లు కూడా లేని పరిస్థితి లేదని ఫైర్ అయ్యారు. తమ కంటే గొప్పగా కాంగ్రెస్ ఏం చెయ్యలేదని.. తమ కంటే గొప్పగా చేసి.. మమ్మలని అంటే బాగుండేదని భట్టీ విక్రమార్కకు చురకలు అంటించారు సీఎం కేసీఆర్. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే ప్రకటించిందని…తాము చేసిన అభివృద్ధి ఇదేనని వెల్లడిచారు. తమకు అభివృద్ధి కనిపించడం లేదని అంటే..మేము ఏం చెయ్యాలని ప్రశ్నించారు.