వక్ఫ్ బోర్డు భూములపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

-

వక్ఫ్ బోర్డు భూముల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. అసెంబ్లీ లో కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో సర్వే చేయించడానికి ప్రభుత్వం సిద్ధమని స్పష్టం చేశారు. దేవాదాయ , వక్ఫ్ బోర్డు భూముల విషయంలో తమ ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని… అవసరమైతే సీబీ , సీఐడి కి అప్పగిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. చేసే వాళ్లు ఉన్నప్పుడే..అడిగే వాళ్ళు అడుగుతారని..వక్ఫ్ భూముల మీద విచారణ కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

KCR-TRS

ఇంతకు ముందు గ్రామాలకు నిధుల కేటాయింపు ప్లానింగ్ లేదని.. గ్రామ పంచాయతీ లు మున్సిపాలిటీ లో చేరితే స్వాగతించాలన్నారు. కానీ మన దగ్గర కోర్టులకు పోతారని మండిపడ్డారు. గ్రామాల్లో 85 శాతం మొక్కలు బతికి ఉండాలని చెప్పామని.. కానీ ఇప్పుడు 90 శాతం మొక్కలు బతికి ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో గ్రామ పంచాయతీ దారుణంగా ఉన్నాయని.. అసలు మంచినీళ్లు కూడా లేని పరిస్థితి లేదని ఫైర్‌ అయ్యారు.  తమ కంటే గొప్పగా కాంగ్రెస్ ఏం చెయ్యలేదని.. తమ కంటే గొప్పగా చేసి.. మమ్మలని అంటే బాగుండేదని భట్టీ విక్రమార్కకు చురకలు అంటించారు సీఎం కేసీఆర్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news