తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్ కోసం అధికారులు గ్రామాల్లో సర్వేను చేపడుతున్నారు..గ్రామంలో ఉన్న ఇళ్ల వివరాలు, ఫ్లాట్ వివరాలను పోర్టల్లో నమోదు చేయడానికి అధికారలు ఇంటింటి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్నారు..కొన్ని ప్రాంతాల్లలో ఈ ప్రక్రియల సాగుకూలంగా సాగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఇది అధికారులకు సవాలుగా మారింది..గడువు దగ్గరపడుతుండటంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది..మరో వైపు గ్రామాల్లో ఇళ్ల స్థాలాల వివరాలు సేకరించడం కష్టంగా మారింది..కొన్ని చోట్ల అధికారులు భౌతిక దాడులకు కూడా గురవుతున్నారు.
తాజాగా వరంగల్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో ఇంటింటి సర్వేకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు గృహ నిర్భంధం చేశారు..గ్రామ కార్యదర్శి, కారోబర్లను గ్రామస్తులు నిర్భంధించి ఎల్ఆర్‌ఎస్ పాటు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను నిలిపివేయాలని అధికారులను గృహనిర్భంధం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామ కార్యదర్శి,కారోబర్‌ని నిర్భంధించిన గ్రామస్తులు..ఎందుకంటే !
-