- డైరెక్టుగా పాయింట్ లోకి వచ్చేస్తే… ఏపీలో వైకాపా కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చేరడంపై చంద్రబాబు ఒక రకంగా ప్లాన్ చేస్తే.. ఆయన అనుకూల మీడియా మరో రకంగా ప్లాన్ చేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు! వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి సిద్ధపడితే నెక్స్ట్ చంద్రబాబు మైకందుకోవాలని, కొన్ని వర్గాలను దూరం చేసేలా చర్యలకు ఉపక్రమించాలని ప్లాన్ చేశారు.. చేరకపోతే, జగన్ కు హస్తినలో అంత సీన్ లేదని.. బీజేపీ దగ్గర బాబుకి ఇంకా డోర్స్ క్లోజ్ అవ్వలేదనే సంకేతాలను జనాల్లోకి పంపాలని ఆయన అనుకూల మీడియా కథనాలు అందించాలని ఫిక్సయ్యారంట!
అవును… జగన్, ఎన్డీఏ లో చేరడం చంద్రబాబు & కో కి, వారి అనుకూల మీడియాకు ఏమాత్రం ఇష్టం లేని అంశం! అదే జరిగితే ఇంక టీడీపీని ఎవరూ కాపాడలేరనేది వారి బలమైన నమ్మకం! ఈ విషయంలో జగన్ హస్తిన వెళ్లిన ప్రతిసారీ చంద్రబాబు కంగారుపడిపోతుంటే.. జగన్ కు కేంద్రంలోని పెద్దలకూ ఏమాత్రం పొసగడం లేదని జనాలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే పనికి నిస్సిగ్గుగా పూనుకుంటుంది ఒక వర్గం మీడియా! అయితే.. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తోంది. దీంతో.. జగన్ జస్ట్ మిస్.. లేదంటే బలే ఇరుకున పెట్టేవాళ్లము అని అనుకుంటున్నారంట బాబు & కో!
అవును.. ఎన్డీఏ లో చేరే విషయంలో కర్ర ఇరగకుండా పాము చావకుండా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు! ఎన్డీఏలో చేరము అని చెప్పినా… అంశాలవారీగా బయట నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు! ఎన్డీఏ చేరతాము అని కన్ ఫాం చేయకుండా… ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆలోచిస్తాము అన్నట్లుగా తెలిపారు! సో… ఎన్డీఏ లో జగన్ నేరుగా చేరితే.. జగన్ రాజకీయాలపై బాబు అల్లరి చేద్దామని ప్లాన్ చేశారు! హోదా పేరు చెప్పి “ప్రజలతో ఉద్యమాలు” చేయలేకపోయినా కనీసం “పేపర్ లో కథనాల ఉద్యమాలు” చేయిద్దామని పథకాలు రచించారు! కానీ… జగన్ దొరకలేదు!
తాను ఏమి ఆలోచించినా చంద్రబాబులా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఆలోచించనని… రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని జగన్ చెప్పకనే చెప్పారు! దీంతో… జగన్ వ్యూహాలకు బాబు & కో విలవిల్లాడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు!
– Ch Raja