వైరల్ వీడియో; వామ్మో ఆ బాబుది గుండె కాదు రా…!

-

తల్లి తండ్రులు స్నానం చేస్తుండగా ఒక బాబు సన్నని లెడ్జ్ పై నడుస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కంగారు పడుతున్నారు. కాని వీడియోలో ఉన్న పిల్లాడు మాత్రం భయపడకుండా అటు ఇటు పరుగులు తీసాడు. సాధారణంగా మనం ఎక్కడైనా ఎత్తులో ఉంటే చాలా భయపడతాం కదా…? కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది.

కాని ఇక్కడ బాలుడు మాత్రం భయపడలేదు. వివరాల్లోకి వెళితే స్కై న్యూస్ కథనం ప్రకారం స్పెయిన్‌లోని టెనెరిఫే నగరంలో శనివారం ఒక వీడియో చిత్రీకరించారు. తల్లి తండ్రులు స్నానం చేస్తుండగా క్లిప్‌లో, పిల్లవాడు ప్లాయా పారాసోలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇరుకైన లెడ్జ్ వెంట త్వరగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అపార్ట్మెంట్ కిటికీ నుండి బయటకు వచ్చి నడుస్తున్నాడు. అపార్ట్మెంట్ బాల్కనీ వైపు పరుగెత్తటం,

ఆగి చూడటం, మళ్ళి వెనక్కు పరిగెట్టడం వీడియోలో ఉంటుంది. ఈ వీడియో ‘ఐ లవ్ టెనెరిఫే’ అనే ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసారు. ఇక్కడ ఇది 3.4 మిలియన్ వ్యూస్ మరియు 25 వేలకు పైగా లైక్స్ ని సాధించింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెను గమనించకుండా వదిలేశారని విమర్శించారు. సోమవారం జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తల్లి తండ్రుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version