వైరల్ వీడియో: రోడ్డుపై కరోనా రోగుల నిరసన

-

కరోనా రోగులు ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేయడం తీవ్ర విమర్శలకు వేదికగా మారుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో తమకు వసతులు లేవు అని ఆవేదన వ్యక్తం చేస్తూ కరోనా రోగులు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులు తమకు టిఫిన్ పెట్టలేదు అంటూ రోడ్డు మీద నరసన చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

coronavirus

ఈ వీడియో ని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా షేర్ చేస్తూ ఏపీ సర్కార్ పై విమర్శలు చేసారు. కేసులు 2,27,860కి చేరుకోగా,మరణాలు 2 వేలు దాటాయి. యాక్టివ్ కేసుల్లో రెండో స్థానం. దేశ సగటు కంటే రాష్ట్రంలో మూడు రెట్ల కేసులు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్న నిపుణులు. వారం రోజులుగా విజృంభణ. వైద్యం అందక, భోజన వసతులు లేక రోడ్డు ఎక్కుతున్న కోవిడ్ బాధితుల ఆవేదన మీకు వినబడుతుందా వైఎస్ జగన్ గారు అంటూ ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version