వైరల్ వీడియో; బౌండరి వద్ద అద్భుతమైన క్యాచ్

-

బిగ్ బాష్ లీగ్ అనగానే సంచలనాలకు మారు పేరు. ఎప్పుడు ఏదోక సంచలనం బ్యాటింగ్ లో ఫీల్డింగ్ లో బౌలింగ్ లో నమోదు అవుతూనే ఉంటుంది. చివరికి అంపైర్లు కూడా ఏదొకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఏదోక రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగానే తాజాగా ఒక క్యాచ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది.

బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) లో మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య శనివారం మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసిజి) లో జరిగింది. ఈ మ్యాచ్ లో స్టార్స్ బౌలర్లు క్రమ౦గా వికెట్లు తీసి రేనిగేడ్స్ కి చుక్కలు చూపించారు. రెనెగేడ్స్ బ్యాట్స్మెన్ లో, షాన్ మార్ష్ 33 బంతుల్లో 43 పరుగులు చేశాడు, మూడు ఫోర్లు మరియు ఒక సిక్సర్ సహాయంతో జట్టుని ఆదుకున్నాడు. దూకుడు గా ఆడుతున్న,

మార్ష్ 15 వ ఓవర్లో అవుట్ అయ్యాడు. 15 ఓవర్లో లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచనే విసిరిన బంతిని సిక్స్ కి ప్రయత్నించగా, లాంగ్-ఆన్ బౌండరీలో బెన్ డంక్ మరియు నాథన్ కౌల్టర్-నైలు అద్భుతంగా క్యాచ్ అందుకున్నారు. బెన్ డంక్ బౌండరి వద్ద క్యాచ్ అందుకోగా అతను పట్టు నిలుపుకోలేక నాథన్ చేతిలోకి బంతి విసరడంతో ఒక్క సారిగా మైదానంలో అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్భుతమైన క్యాచ్ యొక్క వీడియోను ట్వీట్ చేస్తూ, BBL యొక్క అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news