విరాట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ). కోహ్లీ 100 టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రేక్షకులను అనుమతించాలని కోరడంతో పీసీఏ అనుమతి ఇచ్చింది. 50 శాతం మంది కెపాసిటీతో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించనున్నారు. భారత్, శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఈనెల 4 నుంచి మెహాలీ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ తో విరాట్ కోహ్లీ తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు.
ఈ మ్యాచ్ కు ఎలాంటి ఆంక్షలు ఉండవని.. ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రేక్షకులను అనుమతిస్తున్నారని బీసీసీఐ చీఫ్ గంగూలీ చెప్పారు. భారత్, శ్రీలంక తొలిటెస్ట్ తలుపులు మూసి జరుగదని.. ప్రస్తుతం పరిస్థితులు, వివిధ అంశాల ఆధారంగా ప్రేక్షకులను అనుమతిస్తారని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా అన్నారు.
ప్రస్తుతం కోహ్లీ వందో టెస్ట్ కు అనుమతిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అంతకుముందు కరోనా కారణంగా స్టేడియంలోకి ఎవరినీ అనుమతించం అని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. దీంతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అయింది. బీసీసీఐ పై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడ్డారు.