కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో అరుదైన రికార్డు

భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే… మైదానంలో దిగాక… విరాట్‌ కోహ్లి ఎంత యాక్టివ్‌ గా ఉంటాడో.. అంతే దూకుడు గా ఉంటారు విరాట్‌ కోహ్లి. ఇప్పటికే క్రికెట్‌ చరిత్రలో ఎవరూ సాధించలేని పరుగులు సాధించి రికార్డులకెక్కాడు విరాట్‌ కోహ్లి. నిన్న జరిగిన మ్యాచ్‌ నాలుగో టెస్ట్‌ లోనూ అన్ని ఫార్మాటులోనూ 23000 పరుగులు చేసి…సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు విరాట్‌ కోహ్లి.

అయితే… పరుగుల్లోనే కాదు… సోషల్‌ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాడు విరాట్‌ కోహ్లి. శుక్రవారం రోజున విరాట్‌ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ 150 మిలియన్స్‌ దాటారు. దీంతో కోహ్లి మరో రికార్డును బ్రేక్‌ చేశాడు. 150 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ మైలురాయిని దాటిన మొదటి భారతీయ క్రికెటర్ గా విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు.  ఇక ఆటగాళ్లల్లో క్రిస్టియానో ​​రొనాల్డో కు – 337 మిలియన్ల పాలోవర్స్‌ ఉండగా… లియోనెల్ మెస్సీ కు 260 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక్కో పోస్ట్‌కు ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటాడట విరాట్‌ కోహ్లి.