సినిమా పేరు : విరాట పర్వం
నటీనటులు : రానా, సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, నవీన్ చంద్ర, సాయి చంద్ తదితరులు
దర్శకత్వం : ఊడుగుల వేణు
మ్యూజిక్ డైరెక్టర్ : సురేశ్ బొబ్బిలి
నిర్మాతలు : సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి
విడుదల తేదీ : 17 జూన్ 2022
భీమ్లా నాయక్ సినిమా తర్వాత సరికొత్త కథతో హీరో రానా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సాయి పల్లవి జంటగా నటించింది.తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది.ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..
కథ, విశ్లేషణ..
విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్ దళ నాయకుడు అరణ్య అలియాస్ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి..ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్, ఈశ్వరీరావు)ఆమెకు మేనబావ(రాహుల్ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి అనే విషయం పై క్లారిటీ రావాలంటే సినిమాను ఒకసారి చూడాలి..
వెన్నెల కుటుంబ నేపథ్యం, పెరిగిన విధానం, విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం..అతని కోసం కన్నవారిని వదిలి వెల్లడం.. చివరకు పోలీసుల చేతికి దొరకడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. తన తండ్రిపై పోలీసులు దాడి చేసినప్పుడు.. వారితో వెన్నెల వాగ్వాదం చేయడం ఆకట్టుకుంటుంది. ఇక రవన్నగా రానా ఎంట్రీ అయితే అదిరిపోతుంది. రవన్న కోసం దాచుకున్న బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తే.. దానిని కాపాడుకునేందుకు వెన్నెల చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క సీన్ తెలియజేస్తుంది. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్. ఫస్టాప్‌లో కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపించినా, హీరోయిన్ తన మార్క్ తో సినిమాను హిట్ అయ్యేలా చేసిందని టాక్..
సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. పోలీసు స్టేషన్‌లో ఉన్న వెన్నెలను రవన్న దళం చాకచక్యంగా తప్పించడం..ప్రొఫెసర్ శకుంతల (నందితా దాస్) అండతో ఆమె దళంలో చేరడంతో కథలో మరింత స్పీడ్ పెగుతుంది. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. రవన్న తన తల్లిని కలిసి వచ్చే క్రమంలో జరిగే ఎదురుకాల్పుల్లో రవన్న, వెన్నెల కలిసి ఫైరింగ్ చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే సన్నివేశం అదిరిపోతుంది..వెన్నెల చనిపోతుంది..సినిమా లోని ప్రతి పాత్ర సినిమాకు హైలెట్ అయ్యింది..సురేశ్ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా.. కథతో పాటు వస్తాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది..మరి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో సాయంత్రం చూడాలి..
రేటింగ్:2.5/5