18న ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ త‌న‌యుడి ‘వ‌ర్జీన్ స్టోరీ’

-

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, శిరీష త‌న‌యుడు విక్ర‌మ్ స‌హిదేవ్ ప‌లు చిత్రాల్లో బాల‌న‌టుడి పాత్ర‌లు పోషించాడు. ఇటీవ‌ల సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌లైన రౌడీబాయ్స్ చిత్రంలో అత‌ను ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించి ఎంత‌గానో మెప్పించారు. ఇదిలా ఉండ‌గా.. విక్ర‌మ్ స‌హిదేవ్ హీరోగా న‌టించిన వ‌ర్జిన్ స్టోరీ సినిమా ఫిబ్ర‌వ‌రి 18న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. కొత్త‌గా రెక్క‌లొచ్చేనా అనేది దీని ట్యాగ్ లైన్‌. రామ‌ల‌క్ష్మీ సినీ క్రియేస‌న్స్ ప‌తాకంపై ల‌గ‌డ‌పాటి శిరీష శ్రీ‌ధ‌ర్ చిత్రాన్ని నిర్మించారు.

ప్ర‌దీప్ బీ అట్లూరి ఈ చిత్రంలో టాలీవుడ్ లో ద‌ర్శ‌కునిగా అడుగు పెడుతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమాలోని పాట‌లు మ‌న‌సా నిన్న‌లా కొత్త‌గా రెక్క‌లొచ్చేనా బేబీ ఐయామ్ ఇన్ ల‌వ్ ఛాట్ బ‌స్ట‌ర్స్ అయ్యాయ‌ని ఇవ‌న్నీ సినిమాపై పాజిటివ్ బ‌జ్‌ను స‌క్తిని రేకెత్తిస్తున్నాయ‌ని ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ తెలిపారు. యూత్‌పుల్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపుదిద్దుకున్న ఈ సినిమా అంద‌రినీ మెప్పిస్తుంద‌ని రొమాంటిక్ హీరోగా విక్ర‌మ్ కు మంచి పేరు వ‌స్తుంద‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ బి అట్లూరి ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాడు. సౌమిక పాండియ‌న్‌, రిషిక ఖ‌న్నా, వినీత్ బ‌విశెట్టి ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమాకు అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని స‌మ‌కూర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news