సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి చిరంజీవి కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం, బెనిఫిట్ షో, టికెట్ ధరలు, మూతపడ్డ 175 థియేటర్ల థియేటర్ల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి సీఎంకు వివరించారు. ఆ సమయంలో అందరూ కోరకున్నట్లే త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని చిరంజీవి ప్రకటించారు. ప్రభుత్వం విమర్శలు చేయవద్దని సినీ ఇండస్ట్రీకి సూచించారు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వంపై విమర్శలు ఆగిపోయాయి.
అయితే ఫిలిం ఛాంబర్ లో నిర్వహిస్తున్న సమావేశానికి చిరంజీవి వస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ముఖ్యమంత్రితో చర్చించిన అంశాలను ఇతర టాలీవుడ్ ప్రముఖులకు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.