విశాఖ స్టీల్ ప్లాంట్.. చాలా రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తుంది. ప్రైవేటు పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటి నుండి వద్దని నిరసిస్తూ వార్తల్లో నిలిచింది. కోవిడ్ కారణంగా ఈ నిరసన కార్యక్రమాలకి అంతరాయం ఏర్పడింది. తాజాగా మళ్ళీ తమ గళం వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రైవేటు పరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఈ రోజు నిరసన చేపడుతున్నారు. అంతే కాదు ఒప్పంద కార్మికుల వేతన సవరణ విషయాన్ని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా, కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాల వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్ కి సొంతంగా గనులు కేటాయించాలను అంటున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. మరి కార్మికుల డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం వినిపించుకుంటుందా లేదా చూడాలి.