Vishal : విశాల్ ‘లాఠీ’ టీజర్‌ కు ముహుర్తం

-

హీరో విశాల్.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళ్ చిత్ర పరిశ్రమ మరియు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ ఇటీవలే మరో సినిమాను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే.

ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో.. యాక్షన్ మూవీ చేస్తున్నాడు హీరో విశాల్. రాణా ప్రొడక్షన్ పతాకంపై రమణ మరియు నంద సంయుక్తంగా “లాఠీ” సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ కు జోడీగా సునయన నటిస్తోంది.

ఇందులో హీరో విశాల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఇవాళ విడుదలైంది. ఈ సినిమా టీజర్‌ కు ముహుర్తం ఫిక్స్‌ చేసింది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న రిలీజ్‌చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version