సీఎం జగన్ పై బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ ని నియంత,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో విష్ణుకుమార్ రాజు పోల్చి కామెంట్స్ చేశారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల కష్టాలు తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారని, కానీ రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు.
ఉపముఖ్యమంత్రి గా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే..ఏపీకి మొట్ట మొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని ఆయన కోరారు. జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని ఆయన అన్నారు. భారతి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని రాజు పెరోక్న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి..అక్రమాలు జరిగినందున ఎకగ్రీవాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.