మరో ఏడాదిలో జగన్ తన మంత్రి వర్గాన్ని మార్చడం ఖాయం. సగానికి పైగా మంత్రులను మార్చి.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే.. ఇప్పటి నుంచి తమకు మంత్రిపదవులు దక్కే లా నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌ను భారీ ఎత్తున ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక, మంత్రి పదులు కోల్పోయే వారిలో తొలివరుసలో ఉన్న మహిళల్లో ఉప ముఖ్యమంత్రి పుష్ఫ శ్రీవాణి కనిపిస్తున్నారు. ఈమెపై ఎప్పటి నుంచో పార్టీలో చర్చ సాగుతోంది. కురుపాం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించడమే కాకుండా వైఎస్ కుటుంబానికి ఎంతో అనుకూల నాయకురాలిగా పేరున్న పుష్పకు జగన్ అధికారంలోకి రాగానే మంచి పదవి ఇచ్చారు.
అయితే.. కార్యక్రమాలు, పార్టీ వాయిస్ అటుంచితే.. తన శాఖ పరంగా కూడా అంటే.. ఉప ముఖ్యమంత్రిగా .. గిరిజన సంక్షే మ మంత్రిగా ఉన్న శ్రీవాణి..ఆ విషయంలో పట్టు సాధించేందుకు ప్రయాస పడుతున్నారు. ఇప్పటికీ.. ఆమె గిరిజనుల కు సంబంధించి రికార్డు స్తాయి కార్యక్రమం ఏదీ చేయకపోవడం గమనార్హం. పైగా ఇటీవల వచ్చిన కాగ్ నివేదికలోనూ గిరిజనుల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు ఏమీలేవంటూ తప్పు బట్టింది. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని.. చెబుతున్న పుష్ప.. గత చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను పక్కన పెట్టారే తప్ప.. కొత్తగా ఎలాంటి పథకాలను తీసుకురాలేక పోయా రు. అధికారులతోనూ సమన్వయం చేసుకోలేక పోతున్నారు.
ఈ క్రమంలో ఆమెను మంత్రి వర్గం నుంచి పక్కన పెట్టి.. పార్టీలో కీలక బాధ్యతలు (గిరిజనులకు సంబంధించి) చూసేపని ఇస్తారని అంటున్నారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్న వివాద రహిత మహిళా ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతికి ఈ పోస్టు దక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సైలెంట్‌గా ఉంటూనే నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు కళావతి. అంతేకాదు, వివాద రహితంగా.. కుటుంబాన్ని రాజకీయాలకు చాలా దూరంలో ఉంచిన నాయకురాలిగా కూడా జగన్ దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యలో పుష్పను తప్పిస్తే.. కళావతికే ఈ సీటు దక్కుతుందని చెబుతున్నారు.
అయితే ఇదే సీటు కోసం పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడికల రాజన్న దొర రేసులో ఉన్నా ఎస్టీ + మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ కళావతే ఉంటారు.