ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విష్ణు..!!

-

మంచు విష్ణు.. మోహన్ బాబు తనయుడు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన హీరోగా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేసి ప్రత్యర్థి ప్రకాష్ రాజు పై గెలిచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు మంచు విష్ణు. తాజాగా ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయం పై మరొకసారి స్పందించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.Big Joke! Flop Hero Manchu Vishnu Speaks about Producers

ఈరోజు దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు కారణంగా ఇండస్ట్రీలో దర్శకుల దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో ని మంచు విష్ణు మాట్లాడుతూ దాసరి నారాయణ రావు స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు.. ఇండస్ట్రీ పెద్ద అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ దాసరి నారాయణరావు గారే అంటూ ట్వీట్ చేశారు మంచు విష్ణు.

ఇక దీంతో మెగాస్టార్ చిరు అభిమానులు ట్విట్టర్ వేదికగా మంచు విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మెగా అభిమానులు .. దాసరి నారాయణ రావు మృతితో తెలుగు పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తూ అందరిని ఆదుకుంటున్నారు అని ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.Actually, Chiranjeevi Has Sympathy at Manchu Vishnu!

చిరంజీవి కూడా ఇండస్ట్రీ పెద్దగా ఉండడానికి ఆసక్తి చూపించడం లేదు . అంతే కాదు ఎవరు గొప్ప ఎవరు చిన్న అనే విషయాలను పక్కన పెట్టాలని.. ఇండస్ట్రీ కి కష్టం వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగా ఉండాలని చిరంజీవి ఇటీవల చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక పోతే మంచు విష్ణు చేసిన ట్వీట్ మాత్రం బాగా వైరల్ గా మారింది. మంచు విష్ణు ప్రస్తుతం గాలి నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news