హైదరాబాద్: వాహనదారులకు శుభవార్త..ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సర్కారు కీలక నిర్ణయం

-

హైదరాబాద్ లో రోజురోజుకూ ట్రాఫిక్ మరింతగా పెరిగిపోతోంది.మెయిన్ రోడ్డు మొదలుకొని అన్ని దారుల్లో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.ఇలా భారీ ట్రాఫిక్ తో సతమతమౌతున్న నగరవాసులకు కాస్త ఊరటనిచ్చేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ ట్రాఫిక్ విషయంలో భారీ మార్పులకు రంగం  సిద్ధమైంది.

అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో వాహనాల రాకపోకల నియంత్రణలో విజయం సాధిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..మరో వినూత్న పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెరుగుతున్న వాహనాల తోపెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ల పరిష్కారానికి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా గూగుల్ సంస్థ భాగస్వామ్యంతో ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వాహనదారులకు అందించేందుకు ప్లాన్ చేశారు.

ఇందుకు పోలీసులను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను వినియోగించడం ద్వారా అనుకోకుండా జరిగే సంఘటనలు, వీవీఐపీల రాకపోకలు, ర్యాలీలు, ధర్నాలు కారణంగా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ జామ్ ల ప్రభావాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు సమాచారం అందే విధంగా గూగుల్ మ్యాప్ లో అప్డేట్ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news