గురువారం నాడు తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా తన టీమ్‌తో కలిసి మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ‘మా’ సభ్యత్వం గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నియమనిబంధనలను స్వర్గీయ కృష్ణంరాజు గారు వున్నప్పుడు చర్చించాము,వీటిని ఇప్పుడు అమలు చేయబోతున్నామని చెప్పారు
ఎవరికైనా శాశ్వత సభ్యత్వం కావాలంటే ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ కనీసం రెండు సినిమాల్లో పాత్ర లో నటించి వుండాలని అలాగే ఆ రెండు సినిమాలు కచ్చితంగా థియేటర్‌లో కానీ, ఓటీటీలో కానీ విడుదల చేసి వుండాలి అని చెప్పారు. యూట్యూబ్ లో విడుదల చేసిన వాటిని పట్టించుకోము అన్నారు.అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు సభ్యత్వం కావాలంటే వారు 10 సినిమాల లో నటించి వుండాలి. ప్రతి సినిమాలో కనీసం 2 నిమిషాలు డైలాగులు వుండి కనీసం 5 నిమిషాలు అన్నా సినిమాలో కనిపించాలని, జూనియర్ ఆర్టిస్ట్ లాగా వుంటే మాత్రం మెంబర్ షిప్ రాదని చెప్పారు.
ఇవన్నీ లైఫ్ మెంబర్‌షిప్ కోసమేనని.. అసోసియేట్ మెంబర్(టెంపరరీ) కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. అలాగే లైఫ్ మెంబర్లుగా చేరినవారికి వెంటనే ఓటు హక్కు రాదని.. ఐదేళ్లు లైఫ్ మెంబర్‌షిప్‌ను పూర్తిచేసుకున్న సభ్యులకు మాత్రమే ఓటు హక్కు వస్తుందని స్పష్టం చేశారు. అయితే, అసోసియేట్ మెంబర్లకు మాత్రం ఓటు హక్కు అనేది ఉండదని చెప్పారు. లైఫ్ మెంబర్ అయినవారికి ఉచిత ఆరోగ్య బీమా ఉంటుందని. టెంపరరీ వాళ్లకు వుండదని చెప్పారు. ఇలాంటి వారు డబ్బులు కట్టి తమ వద్ద ఉన్న మంచి స్కీముల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చని సూచించారు. దేనిపై ఫిల్మ్ నగర్ లో ఎవరికి నష్టం ఎవరికి లాభం అని చర్చలు సాగుతున్నాయి. దీనిలో భాగంగా విష్ణు వ్యతిరేక వర్గం చాలా మంది మాలో వున్నారని వారిపై ఒత్తిడి కోసం ఈ రూల్స్ తెచ్చారని గుస గుసలు వినిపిస్తున్నాయి.