విశ్వక్ సేన్ తో జోడీ కట్టనున్న ఉప్పెన భామ

-

ఈ నగరానికి ఏమైంది చిత్రంతో వెండి తెరకు పరిచయమైన హీరో విశ్వక్ సేన్. ఆ తర్వాత ఫలక్ నూమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యాడు. ఇటీవల హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్ చిత్రంతో మంచి హిట్ దక్కించుకున్న విశ్వక్ ఇప్పుడు పాగల్ అనే మరో చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు..

అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఇటివల మెగా మేనల్లుడు ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టిని ఈ చిత్రంలో ఈ విశ్వక్ సేన్ పక్కన హీరోయిన్ గా తీసుకోనున్నట్లు సమాచారం. ఉప్పెన సినిమా ప్రోమో సాంగ్ విడుదలైన వెంటనే కృతి శెట్టికి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఆ సాంగ్ ప్రోమో చూసి చాలా మంది ప్రొడ్యూసర్లు ఆమెకు ఆఫర్లు ప్రకటించారు. ఇప్పటికే హీరో నిఖిల్ నటిస్తోన్న 18 పేజీలు సినిమాలో నిర్మాతలు ఈ హీరోయిన్నే ఫిక్స్ చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news